అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ ఫోటో
posted on Mar 9, 2013 4:02PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ శరీరంపై టాటూలు వేసుకుని, ఫ్రెష్ లుక్స్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. ఫస్ట్ టైం టాలీవుడ్ లో స్పెయిన్ లో ప్రసిద్ధి చెందిన బుల్ రేస్ ను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్.
.jpg)